![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-495 లో.. నర్మద, ప్రేమ ఇద్దరు కలిసి అసలు నేరస్థుడిని తీసుకొస్తారు. వాడిని చూసి ఎస్ఐ టెన్షన్ పడతాడు. వీడే సర్ మామిడికాయలతో కారులోకి వచ్చిందని నర్మద, ప్రేమ చెప్తారు. మీరు చెప్పేది నేను నమ్మాలా.. దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుందని ఎస్ఐ అంటాడు. రేయ్ ధీరజ్ ని తీసుకొని రండ్రా అని అనగానే సరే అయితే మీరు తీసుకెళ్ళండి మేము వీడిని ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళి నిజం చెప్పిస్తాం.. అప్పుడు తెలుస్తుంది.. వీడితో అలా చెప్పించింది ఎవరో.. వీడికి మాదకద్రవ్యాలు ఇచ్చింది ఎవరో.. వీడి వెనుక ఉంది ఎవరో.. అంతా తెలుస్తుందని నర్మద అనగానే ఎస్ఐ భయపడతాడు.
ఎక్కడ తన గురించి తెలుస్తుందో ఎమోనని ఎస్ఐ టెన్షన్ పడతాడు. సర్లే వదిలేయండి అని ఎస్ఐ వాడిని తీసుకొని.. రేయ్ నువ్వేనా కార్ లో మాదకద్రవ్యాలు తీసుకొచ్చిందని అడుగుతాడు. వాడు అవునని అనడంతో.. ధీరజ్ ని వదిలేసి వీడిని తీసుకెళ్ళండి అని ఎస్ఐ చెప్తాడు. దాంతో పోలీసులు ధీరజ్ ని వదిలేసి వాడిని తీసుకెళ్తారు. ఇక రామరాజు, చందు, నర్మద, ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ధీరజ్ ని రామరాజు హగ్ చేసుకొని చాలా సంతోషంగా ఉందిరా.. వెంటనే మనం ఇంటికి వెళ్ళాలి.. మీ అమ్మ ఎదురుచూస్తోందిరా అని అంటాడు. ఇక ప్రేమ వెళ్ళి ధీరజ్ ని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే ప్రేమ చేతికి ఉన్న గాయం చూస్తాడు ధీరజ్. ఏం అయిందని అడుగుతాడు. ఇక ఆ రౌడీని చేజ్ చేస్తున్నప్పుడు ప్రేమకి తగిలిన గాయమని జరిగిందంతా చెప్పగానే.. సభాష్ అమ్మా రామరాజు కోడళ్ళు అనిపించారని రామరాజు అంటాడు. ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అందరు ఇంటికి బయల్దేరతారు.
మరోవైపు ఇంట్లో ఉన్న దేవుడికి వేదవతి మొక్కుకుంటుంది. అదంతా శ్రీవల్లి, సుకన్య చూస్తారు. ఈవిడ ఇక్కడ మొక్కుకుంటే అక్కడ ధీరజ్ ని వదిలేస్తారా ఏంటని శ్రీవల్లి అనుకోగానే కార్ ఇంటి ముందుకొస్తుంది. అందులో నుండి ధీరజ్, ప్రేమ, నర్మద, రామరాజు, చందు దిగుతారు. ఇక ధీరజ్ ని చూడగానే వేదవతి ఎమోషనల్ అవుతుంది. వచ్చి ధీరజ్ ని హత్తుకొని ఏడుస్తుంది. ఇక ధీరజ్ ని చేయి పట్టుకొని భద్రవతి, సేనాపతిల ఇంటి ముందుకి వెళ్తుంది ప్రేమ. వాళ్ళని పిలవగానే సేనాపతి, భద్రవతి వస్తారు. మీరు ఎన్ని కుట్రలు చేసి మమ్మల్ని విడదియ్యాలని చూసినా మేము ఇంకా ఇంకా దగ్గరవుతామని ప్రేమ చెప్తుంది. మేము ఇప్పుడు ఎవ్వరు విడదియ్యలేనంత ప్రేమలో ఉన్నామని ప్రేమ అనగానే భద్రవతి, సేనాపతి కోపంగా చూస్తారు. నా కుటుంబమే నాకు బలం, బలహీనత. ఏదైనా ఆపదొస్తే అందరు నాకు బలంగా ఒకే త్రాటిపై నిలబడతారని రామరాజు గర్వంగా చెప్తాడు. ఇక అందరు రామరాజు ఇంటిగుమ్మం దాకా వెళ్తారు. ఇంటి లోపల సుకన్య, శ్రీవల్లి ఉంటారు. ఇంటికి వచ్చిన వారికి దిష్టి తీయాలని కూడా తెలియదా అని శ్రీవల్లిని వేదవతి తిట్టగానే తను హారతి తీసుకొస్తుంది. ఇక దాని తర్వాత అందరు ఇంట్లోకి వెళ్తారు. జరిగిందంతా నర్మద, ప్రేమ చెప్తుంటే ఆనందరావు, భాగ్యం వచ్చి మేము కూడా హెల్ప్ చేశామని చెప్తారు. ఆ తర్వాత అందరు నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |